శనివారం 23 జనవరి 2021
Nirmal - Jun 11, 2020 , 01:51:09

మెరుగైన సేవలకు బడ్డీయాప్‌

మెరుగైన సేవలకు బడ్డీయాప్‌

  • పారదర్శకతే లక్ష్యంగా రూపకల్పన
  • మున్సిపాలిటీలో అక్రమాలకు చెక్‌
  • సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు
  • ఆస్తి, నీటి పన్నులు చెల్లించవచ్చు
  • కుళాయి, పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం

మున్సిపాలిటీల్లో మెరుగైన సేవలు అందించడంతోపాటు అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం భైంసా మున్సిపల్‌ పరిధిలో బడ్డీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పారదర్శకతతో కూడిన మెరుగైన సేవలు అందనున్నాయి. సమస్యలపై విన్నవించేం దుకు ఇక ముందు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నేరుగా యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. సమస్య సంబంధిత అధికారి దృష్టికి వెళ్తుంది. దీంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఆస్తి, నీటి పన్నులతో పాటు డిజిటల్‌ చెల్లింపులకు దోహదపడనుంది. పింఛన్‌, కుళాయి కనెక్షన్‌ కోసం యాప్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.                                                                                                                                                                                                                                          - భైంసా 

ఇంటి ముందు చెత్త పేరుకుపోయినా, డ్రైనేజీలు నిండిన, నీటి పైపుల లీకేజీలు ఏర్పడినా, రోడ్లు చెడిపోయినా, కుళాయిలో నీరు రాకపోయినా.. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బందులు పడాల్సిన అవసరం ఇకపై లేదు. పారిశుద్ధ్య లోపం, దోమలు, కోతులు, కుక్కల బెడద, ఇతర ఏ సమస్యలున్నా వెంటనే భైంసా మున్సిపల్‌ బడ్డీయాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అప్పటికప్పుడు ఫొటో తీసి అప్‌లోడ్‌ చేసే అవకాశం కూడా ఉంది. ఇంజినీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, పన్నుల విభాగం, ప్రజారోగ్యం, లీగల్‌, సాధారణ పరిపాలన విభాలకు సంబంధించి ఫిర్యాదు నమోదు చేయగానే.. ఓ నంబర్‌ను కేటాయిస్తారు. దాని ఆధారంగా ఫిర్యాదు పురోగతి తెలుసుకోవచ్చు. 

డిజిటల్‌ చెల్లింపులు..

యాప్‌ ద్వారా సమస్యలపై ఫిర్యాదు చేయడమేకాదు.. ఆస్తి, నీటి పన్నులు, ట్రెడ్‌ లైసెన్స్‌, ఫీజు, యూజర్‌ చార్జీలు, మీ టరు, కుళాయి చార్జీలు చెల్లించే అవకాశం కూడా ఉంది. 

దరఖాస్తులు..

కొత్త ట్రేడ్‌ లైసెన్స్‌, పింఛన్‌, కొత్త కుళాయి కనెక్షన్‌ ఈ యాప్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీస్‌ ద్వారా సంబంధిత అధికారి ఉద్యోగికి దరఖాస్తు అందుతుంది. ఆ దరఖాస్తుకు సంబంధించిన నంబర్‌ ద్వారా ఏ స్థాయిలో ఉందో.. తెలుసుకోవచ్చు. 

సమాచారం..

ప్రజలు ఉన్న ప్రాంతానికి సమీపంలోని సులభ్‌ కాంప్లెక్స్‌ లు, చిల్ట్రెన్‌పార్కు, నర్సరీలు, ఏటీఎం సెంటర్లు, ప్రభు త్వ కార్యాలయాలు, దవాఖానలు ఎక్కడెక్కడ ఉన్నా యో కూడా యాప్‌ ద్వారా తెలుసుకునే వీలుంది. 

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..

మొబైల్‌ ఫోన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి భైంసా మున్సిప ల్‌ బడ్డీయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పేరు. మొబై ల్‌ నంబర్‌ నమోదు చేయగానే.. ఓటీపీ వస్తుంది. ఆ నంబర్‌ నమోదు చేశాక.. రిజిస్ట్రర్‌ కావడంతో పౌర సేవలు, ఇతర సేవలు అందుకోవడమే కాదు.. ఫిర్యాదులు చేసేందుకు వెసులుబాటుంది. logo