సోమవారం 25 జనవరి 2021
Nirmal - Jun 11, 2020 , 01:45:17

‘ట్యాంకర్ల’ అక్రమాలపై విచారణ

‘ట్యాంకర్ల’ అక్రమాలపై విచారణ

  • ‘నమస్తే తెలంగాణ’కథనానికి స్పందన
  • అక్రమ వ్యవహారంపై ఆరా తీసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • క్వాలిటీ కంట్రోల్‌ విభాగంతో  విచారణకు కలెక్టర్‌ ఆదేశం

గ్రామ పంచాయతీలకు అందజేసిన వాటర్‌ ట్యాంకర్లలో అక్రమాలపై కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ దృష్టి పెట్టారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘పాత ట్యాంకర్లలో అవినీతి ధార’ శీర్షికన వచ్చిన కథనంపై స్పందించారు. క్వాలిటీ కంట్రోల్‌ అధికారులను విచారణకు ఆదేశించారు. మరోవైపు గడువు ముగిసినా, ట్యాంకర్లు సరఫరా చేయని రెండు కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. కాగా, ఈ విషయమై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరా తీసి, విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు సమాచారం.             

నిర్మల్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో పంచాయతీల ట్రాక్టర్ల కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ మొదలైంది. ‘పాత ట్యాంకర్లలో అవినీతి ధార’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ జిల్లాపేజీలో ప్రచురితమైన కథనానికి నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ స్పందించారు. నాసిరకం ట్యాంకర్లు, పాత టైర్లు పెట్టి, మరమ్మతులు చేసి రంగులు వేసి సరఫరా చేయడంపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. ‘నమస్తే తెలంగాణ’ కథ నం ఆధారంగా విచారణకు ఆదేశించారు. నాసిరకంగా, పాత ట్యాంకర్లను సరఫరా చేస్తున్న కంపెనీ వ్యవహారంపై క్వాలిటీ కంట్రోల్‌కు రా శారు. మరోవైపు సకాలంలో ట్యాంకర్లు సరఫరా చేయని మరో రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ట్యాంకర్ల సరఫరాకు వారి కి ఇచ్చిన గడువు పూర్తయిందని, పది రోజుల్లోగా ట్యాంకర్లను సరఫరా చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నాసిరకం, పాత ట్యాంకర్లకు రంగులు వేసి మరమ్మతులు చేసి సరఫరా చేస్తున్న వారి టెండరును రద్దు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.

మరోవైపు ట్యాంకర్ల అక్రమ వ్యవహారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో స్పందించిన ఆయన నాసిరకం ట్యాంకర్లు, పాత ట్యాంకర్లను సరఫరా చేసిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు సమాచా రం. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. జిల్లాలో నాసిరకం, పాత ట్యాంకర్లు సరఫరా చేస్తున్న కంపెనీపై విచారణ చేయాలని క్వాలిటీ కంట్రో ల్‌ కమిటీకి రాశామని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ నమస్తే తెలంగాణతో పేర్కొన్నారు. సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని బా ధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, టెం డర్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు సకాలంలో ట్యాంకర్లు సరఫరా చేయని రెండు కంపెనీలకు నోటీసులు ఇచ్చామన్నారు. 

తవ్వేకొద్దీ అక్రమాలు..

జిల్లాలో గ్రామపంచాయతీలకు సరఫరా చేసే ట్యాంకర్లలో తవ్వేకొద్ది అక్రమాలు వెలు గు చూస్తున్నాయి. కొన్ని కంపెనీలకు ఎక్కువ మొత్తంలో ట్యాంకర్లు కేటాయించగా.. వారు గడువు ముగిసినా సరఫరా చేయడం లేదు. మహారాష్ట్రకు చెందిన ఓ కంపెనీకి 130 ట్యాం కర్లు కేటాయించగా.. వీటికి సంబంధించిన చెక్కులను కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు పదిశాతం ట్యాంకర్లు కూడా సరఫరా చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికి సరఫరా చేయకుండా, డబ్బు లు వెనక్కి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్థానికులకు కాకుండా మొత్తం మహారాష్ట్ర వారికే ఇవ్వడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక ఉత్తర్వులతో స్థానికులకు కొన్ని ట్యాంక ర్లు కేటాయించారు. మహారాష్ట్రలోని కంపెనీ ట్యాంకర్లు సరఫరా చేయకున్నా, చేసినట్లు లె క్కలు చూపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై డీపీవో శ్రీనివాస్‌ను సంప్రదించగా.. జిల్లాలో నాసిరకం, పాత వాటికి రంగులు వేసి ట్యాంకర్లు సరఫరా చేస్తున్న వ్యవహారంపై విచారణ చేయిస్తున్నామన్నారు. ఏ గ్రామ పం చాయతీకైనా నాసిరకం, పాత ట్యాంకర్లు సరఫరా చేస్తే లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాలన్నారు. జిల్లాలో స్థానికులు ట్యాంకర్లు సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతోనే మహారాష్ట్రలోని గుర్తింపు పొందిన కంపెనీకి టెండరు ద్వారా అప్పగించామన్నారు. 130 ట్యాంకర్లకు గాను చెక్కులు ఇచ్చామని 60 వరకు సరఫరా చేశారని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ట్యాంకర్లు సకాలంలో సరఫరా చేయలేకపోయారని పేర్కొన్నారు.logo