నకిలీ ‘బీటీ-3’ పట్టివేత

n వివరాలు వెల్లడించిన ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
n పట్టుబడ్డ 785 విత్తన ప్యాకెట్ల పరిశీలన
n చింగూడలో 62 ప్యాకెట్లు స్వాధీనం
ఎదులాపురం: రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ పట్టుబడిన నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ స మావేశ మందిరంలో సోమవారం వివరాలు వెల్లడించా రు. ఆదివారం టాస్క్ పోర్స్ సీఐ చంద్రమౌళి గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ పురుషోత్తమచారి ఆ ధ్వర్యంలో వ్యవసాయ అధికారి మహేందర్తో కలిసి మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్కాలనీలో తనిఖీలు చేపట్టగా షేక్ మేహరజ్, మహ్మద్ ముస్తఫా ఇంట్లో 785 ప్యాకెట్లు లభ్యమైనట్లు చెప్పారు. ఇద్దరు మధ్యప్రదేశ్, నీమచ్ గ్రా మానికి చెందిన కాలునాథ్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పారని పేర్కొన్నారు. కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఈ విషయం లో జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టుకున్న పోలీసులకు ప్రోత్సాహక రివార్టులు అందిస్తున్నట్లు తెలిపారు. అడిషన ల్ ఎస్పీ వినోద్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వరరా వు, గ్రామీ ణ సీఐ పురుషోత్తం చారి, సీసీఎస్ సీఐ ఈ చంద్రమౌళి, మవాల ఎస్ఐ రమేశ్ కుమార్, టాస్క్ ఫోర్స్ పోలీసులు తదితరులు ఉన్నారు.
చింతగూడలో పట్టుబడ్డ విత్తనాలు
కడెం: అల్లంపల్లి పంచాయతీ పరిధిలోని చింతగూడలో పోలీసులు, వ్యవసాయ శాఖల ఆధ్వర్యం లో నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామానికి చెందిన నారాయ ణ, ఆత్రం మోతీరాం ఇంట్లో తనిఖీ చేయగా 62 నకిలీ ప్యాకెట్లు లభ్యమైనట్లు తెలిపారు. కొందరు వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి కమీషన్ మీద తమకు ఇవ్వడంతో విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీరాంప్రేమ్దీప్ తెలిపారు. ఏవో ఆసం రవి, ఏఈవోలు సురేశ్, నాగమణి, పోలీసు సిబ్బంది ఉన్నారు.