బుధవారం 27 జనవరి 2021
Nirmal - Jun 08, 2020 , 01:20:57

యాసంగిలో పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి

యాసంగిలో పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి

  • జిల్లావ్యాప్తంగా 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తి
  • ఇప్పటికే 1.30లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు
  • నేటితో ముగియనున్న ధాన్యం కొనుగోళ్లు
  • హమాలీలు, లారీల కొరత అధిగమించి ముందుకు.. 

యాసంగిలోనూ ధాన్యం పంట పండింది. అన్నదాత ఇంట సిరుల పంట కురిసింది. జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో పెద్ద ఎత్తున వరి సాగు   చేయగా.. రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి ప్రతి గింజనూ కొనుగోలు చేసింది. కరోనా నేపథ్యంలో హమాలీలు, లారీల కొరత ఉన్నా.. ధాన్యం, మక్కలు ఒకేసారి మార్కెట్‌కు వచ్చినా అన్నింటిని అధిగమించి కొనుగోళ్లు పూర్తి చేస్తున్నారు. నేటితో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కానున్నాయి. 

 నిర్మల్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశా రు. విస్తారంగా వర్షాలు కురియడంతో సాగునీ టి కి ఢోకా లేకుండా పోయింది. రిజర్వాయర్లు, ప్రాజె క్టులు, చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉండగా.. భూగర్భ జలమట్టం పైపైకి రావడంతో బోరుబావుల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో యాసంగిలో జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావుల కింద సుమారు లక్ష ఎకరాల్లో రైతు లు వరి సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇప్ప టి వరకు 1.30లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. జిల్లావ్యాప్తంగా 210 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించగా.. 196 కొనుగో లు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయ గా.. ఇప్పటికే 1.10లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యా న్ని గోదాములు, రైస్‌మిల్లులకు తరలించా రు. సుమారు రూ.239 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతు ల నుంచి కొనుగోలు చేయగా.. ఇప్పటికే 150 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మరో 20వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములు, రైస్‌ మిల్లులకు తరలించాల్సి ఉంది.

ఏప్రిల్‌ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించగా.. రెండు నెల లుగా ధాన్యాన్ని కొంటున్నారు. వాస్త వానికి మే 31తో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావా లి. జిల్లాలో రైతుల వద్ద ఇంకా ధాన్యం నిల్వలు ఉన్నాయని మరికొద్ది రోజులు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకర ణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం కేసీఆర్‌ జూన్‌ 8 వరకు ధాన్యం కొనుగోళ్లకు అవకాశం ఇచ్చారు. జిల్లాలో 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మరో 15వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంది. నేటితో (సోమవారం) జూన్‌ 8 ధాన్యం కొనుగోళ్లు పూర్తి కానుండగా.. ఆది, సోమ వారా ల్లో మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు కొను గోలు చేసిన ధాన్యాన్ని 12వ తేదీలో గా గోదాము లు, మిల్లులకు తరలించేలా చర్యలు చేపడుతున్నా రు. ఈసారి 1.50లక్ష మెట్రిక్‌ టన్ను ల వరకు దిగుబడి వచ్చింది. గతంలో కంటే 50 శాతం ధాన్యం పెరిగినా ప్రతి గింజకూ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్‌ రకానికి క్వింటా లుకు రూ. 1835, సాధారణ రకానికి రూ. 1810 చొప్పున ధర చెల్లిస్తున్నారు. జిల్లాలో ధాన్యం, మక్కలు ఒకేసారి మార్కెట్‌కు వచ్చాయి. గతేడాది ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేయలేదు. ఈ సారి మక్కలను క్వింటాలుకు రూ. 1760 చొప్పు న మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేశారు. బహిరం గ మార్కెట్లో మక్కలకు ధర లేకపోవ డం తో రైతులకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగో లు చేసింది.

జిల్లాలో 1.22లక్షల మెట్రిక్‌ టన్నులు కొనగా.. వీటిని ఆయా గోదాముల్లో పెట్టారు. భైంసా, నిర్మల్‌, ఆదిలాబాద్‌ లారీ అసో సియేషన్ల తో ఒప్పందం కుదుర్చుకొని ధాన్యం రవాణా చేశారు. రోడ్లపై వెళ్తున్న లారీలను ఆపి ధాన్యం రవాణాకు ఉపయోగించారు. బీహార్‌ రాష్ట్రం నుం చి 60మంది వలస కూలీలను తీసుకొ చ్చారు. వారితోపాటు ఉన్న 150 నుంచి 200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి లో డింగ్‌, అన్‌లోడింగ్‌ చేశారు. జిల్లాలో 60వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేయగా.. పెద్దప ల్లిలో 10వేలు, మెదక్‌లో 10వేలు, సంగారెడ్డిలో 5వే లు, కరీంనగర్‌లో 50వేల సామర్థ్యం గల గోదా ములను కేటాయించారు. కరోనా నేపథ్యం లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి గింజకు మద్ద తు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసింది. 

నేటితో ధాన్యం కొనుగోళ్లు పూర్తి..

జిల్లాలో ఇప్పటి వరకు 1.30లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నాం. మరో 10వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొంటున్నాం. సోమవారం సాయంత్రంతో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయి. ఆ తర్వాత మూడు, నాలుగు రోజుల్లో ధాన్యాన్ని రవాణా చేస్తాం.రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తు న్నాం. మక్కలు, ధాన్యం ఒకేసారి మార్కెట్‌కు రావడం ఉన్న గోదాములు మక్కలకే సరిపోవడం తో ప్రైవేటు వాటిని తీసుకున్నాం. జిల్లాలో హమా లీలు, లారీ డ్రైవర్ల సమస్య అధిగమించి విజయ వంతంగా కొనుగోళ్లు పూర్తి చేసుకున్నాం. నేటితో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయి. 

- ఏ భాస్కర్‌రావు, జిల్లా అదనపు కలెక్టర్‌


logo