అందుబాటులో అన్ని మందులు :డీఎంహెచ్‌వో

ఎదులాపురం : వర్షాకాలం, కొవిడ్-19కు కావా ల్సిన మందులు, మాత్రలన్నీ అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌లో వర్షాకాల వ్యా ధుల నివారణ సంబంధిత మందులు , మాత్రలు అన్ని అందుబాటులో ఉన్నాయని వివరించారు. వీటితో పాటు కొవిడ్ -19కు సంబంధించిన కిట్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయన్న వివరాలను సంబంధిత అధికారికి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వర్షకాలంలో ప్రబలే వ్యా ధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. పీహెచ్సీ వైద్యులు గిరిజన గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు వర్ష్షాకాలంలో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు తీసుకోవా ల్సిన జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. డీఎంహెచ్‌వో వెంట జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ వైసీ శ్రీనివాస్ ఉన్నారు.
తాజావార్తలు
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!
- ఆ బుల్లెట్ ఎవరిదో తెలిసిపోయింది..!
- సీబీఐ, ఈడీ స్వతంత్రంగా లేకుంటే ప్రజాస్వామ్యానికే తీరని ముప్పు!
- యజమాని కోసం ఆసుపత్రి వద్ద కుక్క నిరీక్షణ
- ఈ రంగాల్లో కొలువుల కోతకు బ్రేక్!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- 24న తెలంగాణ తాసిల్దార్ల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
- టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు