గురువారం 21 జనవరి 2021
Nirmal - Jun 06, 2020 , 01:44:21

చేల వద్దే విక్రయాలు

చేల వద్దే విక్రయాలు

లోకల్‌ మార్కెట్లుగా రహదారులు  

వినియోగదారులకు తాజా కూరగాయాలు..

రైతులకు తప్పిన దళారుల బెడద   

లాక్‌డౌన్‌ వేళ లాభదాయకం.. 

కుభీర్‌ : కుభీర్‌-భైంసా రహదారి గ్రామాలైన గోడ్సర, పాం గ్ర, బాకోట్‌ రైతులు కూరగాయలు అధికంగా సాగు చేస్తారు. బెండ, టమాట, చిక్కుడు, మిర్చి, బీర, వం కాయ, దోస వంటి వాటితోపాటు తర్భూజా, మా మిడి, ఎల్లి, ఉల్లి గడ్డలు, కొత్తిమీర పండిస్తుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆటోలు, బస్సులు తిరగక పోవ డం, మార్కెట్లు అన్నీ బంద్‌ ఉండడం వల్ల తమ చేలవద్దే రహదారికి ఆనుకుని కూరగాయలు విక్రయిస్తున్నారు. రహదారి వెంట వెళ్లే వారు కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరకు లభించడమే కాకుండా.. తా జా కూరగాయలు లభిస్తున్నాయని వినియోగదారులు పేర్కొంటున్నారు. అంతకముందు ఇక్కడి రైతులు కూ రగాయలను భైంసా, ధర్మాబాద్‌, భోకర్‌ మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకునేవారు. ఇప్పుడు ఈ బాధ తప్పిందని రైతులు పేర్కొంటున్నారు. మంచి లాభాలు కూడా వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


logo