ఆదివారం 17 జనవరి 2021
Nirmal - Jun 04, 2020 , 02:04:38

సంపూర్ణ శుభ్రతతోనే ఆరోగ్య భద్రత : ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

సంపూర్ణ శుభ్రతతోనే ఆరోగ్య భద్రత : ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

భైంసా : సంపూర్ణ శుభ్రతతోనే ఆరోగ్య భద్రత సాధ్యమని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన ఆవరణలో బుధవారం పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛభారత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా స్పెషల్‌ శానిటైజ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు మురళీగౌడ్‌, తోటరాము, ఎజాజ్‌ హైమద్‌, అరవింద్‌, మైసేకర్‌ సాయిలు, శంకర్‌చంద్రే, మంత్రి భోజరాం ఉన్నారు.  అనం తరం పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని బుధవారం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పరిశీలించారు.  ఇప్పటికే దవాఖాన కమిటీలో తీర్మానం చేశామని, ఈ తీర్మాన పత్రాన్ని కలెక్టర్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఈయన వెంట ఏరియా దవాఖాన సూపరిండెంట్‌ డాక్టర్‌ కాశీనాథ్‌, దళిత సంఘ నాయకులు మైసేకర్‌ సాయిలు, గంగాధర్‌ దగ్డే, గౌతం పింగ్లే, ప్రసన్నజిత్‌ అగ్రే, శంకర్‌ చంద్రే తదితరులున్నారు. 

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

కుంటాల : మండలంలోని అందకూర్‌ గ్రామానికి చెందిన పలు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి బుధవారం పరామర్శించా రు. రోడ్డు ప్రమాదం లో భూమవ్వ మృతి చెందగా.. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం పీరాజీ, భోజన్న, సాయన్న కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ పడకంటి దత్తు, సర్పంచ్‌ కిషన్‌, ఎంపీటీసీ మధు, నాయకులు రమణారావు, సాగర్‌రావు, రాకేశ్‌, వెంకటేశ్‌ తదితరులున్నారు.