ఆదివారం 12 జూలై 2020
Nirmal - Jun 03, 2020 , 04:50:32

మరో ఇద్దరికి పాజిటివ్‌

మరో ఇద్దరికి పాజిటివ్‌

మహబూబ్‌నగర్‌ క్రైం/జడ్చర్ల : మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంగళవారం మరో ఇ ద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టకు చెందిన 45 ఏండ్ల మహిళ కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతూ మహబూబ్‌నగర్‌ దవాఖానలో చి కిత్స పొందుతున్నది. ఆమెకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా వచ్చింది. ఆమెను గాంధీ దవాఖానకు తరలించారు. అలాగే జడ్చర్ల మండలం మల్లెబోయిన్‌పల్లి గ్రామానికి చెందిన 30 ఏండ్ల యువకుడు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో పనిచేస్తున్నాడు. ఆ యువకుడికి కరోనా లక్షణాలు ఉండడంతో సోమవారం హైదరాబాద్‌కు శాంపిల్స్‌ను పంపించగా మంగళవారం పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడిని జిల్లా దవాఖానలోని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. డీఎంహెచ్‌వో కృష్ణ, జిల్లా మలేరియా అధికారి శరత్‌కుమార్‌, తాసిల్దార్‌ లక్ష్మీనారాయణ యువకుడి కు టుంబసభ్యులను హోంక్వారంటైన్‌లో ఉంచారు. మల్లెబోయిన్‌పల్లిని కంటైన్మెంట్‌ జోన్‌ గా ప్రకటించి, యువకుడి ఇంటి వద్ద సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.


logo