శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - May 29, 2020 , 02:24:25

పట్టణ ప్రగతిలో పురోగతి సాధించాలి

పట్టణ ప్రగతిలో పురోగతి సాధించాలి

కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ   

నిర్మల్‌ టౌన్‌: పట్టణ ప్రగతిలో పురోగతి సాధించా లని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధి కారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం లో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీ పరి ధిలో  పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమా ల  పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వార్డులో మురుగు నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రోజువారీ చెత్తను సేకరించి  డంపింగ్‌ యార్డులకు తరలించాలని సూచించారు. విద్యుత్‌ లైన్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశిం చారు. పట్టణ  ప్రగతి నివేదికలను ఎప్పటిక ప్పుడు సమీక్షించుకుని ప్రతి మున్సిపాలిటీలో ప్రగతి సాధిం చేలా చూడాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరేందుకు ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo