Nirmal
- May 28, 2020 , 06:16:43
కళాకారులకుమంచి గుర్తింపు

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్ : ప్రత్యేక రాష్ట్రంలో కళాకారులకు మంచి గుర్తింపు దక్కిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం కళాకారులు ఎంతో కష్టపడ్డారని, సాంస్కృతిక శాఖలో అనేక మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ చనిగారపు నరేశ్, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నాగరాజు, వెన్నెల డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ ధన్‌రాజ్, పరమేశ్, బాలకృష్ణ, కల్యాణి, రాధ, మమత, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING