శనివారం 06 జూన్ 2020
Nirmal - May 20, 2020 , 02:57:47

వరి విత్తనాలు విక్రయించొద్దు..

వరి విత్తనాలు విక్రయించొద్దు..

నిర్మల్‌ అర్బన్‌ : నియంత్రిత వ్యవసాయ వి ధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ దేశాలు వచ్చే వరకు డీలర్లు వరి విత్తనాలను విక్రయించవద్దని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం అధికారులు, వి త్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లాల వా రీగా ప్రభుత్వం పంట లక్ష్యాలు నిర్దేశించిందన్నారు. అందుకు అవసరమైన విత్తనాలు పం పిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఆదేశాలు వస్తాయని, అప్పటి వరకు వరి విత్తనాలను పంపిణీ చేయవద్దని ఆదేశించారు. మక్క సాగుచేసిన వారికి ‘రైతుబంధు’ వర్తించదని, కనీస మద్ద తు ధర ప్రభుత్వం చెల్లించదని తెలిపారు. ప్ర భుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు పత్తి సాగుచేయాలని సూచించారు. డీలర్లు మక్క విత్తనాలు అమ్మవద్దని సర్క్యులర్‌ జారీ చేయాలని వ్యవసాయ అధికారికి ఆదేశించారు. అనంతరం సాగు యంత్రాల స్టాక్‌ వివరాల గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్‌ మాట్లాడుతూ.. మండలం, క్లస్టర్‌, గ్రామాలకు అనుగుణంగా నిర్దేశించిన పంటల వారీగా కార్డు ఇస్తామ న్నారు. సమావేశంలో కోటేశ్వర్‌ రావు, మహ్మద్‌ ఇబ్రహీం హనీఫ్‌, వినయ్‌ బాబు, వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

భూముల వివరాలు నమోదు చేయాలి..

జిల్లాలోని ప్రాజెక్టులు, కాలువలకు సంబంధించిన భూములను గుర్తించి, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఇరిగేషన్‌ ఇంజినీర్లతో భూ సంస్కరణల పర్యవేక్షణ వ్యవస్థ (ల్యాండ్‌ రిఫార్మ్స్‌ మానిటరింగ్‌ సిస్టం), ప్రాజెక్టు పర్యవేక్షణ వ్యవస్థ (ప్రాజెక్టు మానిటరింగ్‌ సిస్టం)పై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఏ భాస్కర్‌ రావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్‌, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ రామారావు, ఆర్డీవో ప్రసునాంబ, రాజు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


logo