బుధవారం 27 జనవరి 2021
Nirmal - May 15, 2020 , 02:09:16

బోధన్‌ లయన్స్‌ క్లబ్‌ దాతృత్వం

బోధన్‌ లయన్స్‌ క్లబ్‌ దాతృత్వం

  • 50 రోజులుగా అన్నదానం
  • రక్తదాన శిబిరాల నిర్వహణ  
  • 8 వేల మాస్కులు, శానిటైజర్ల్లు పంపిణీ

బోధన్‌: లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక పస్తులుంటున్న వలస కార్మికులు, నిరాశ్రయులకు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బోధన్‌ బాసటగా నిలుస్తున్నది. 50 రోజులుగా బోధన్‌లో వలస కార్మికులకు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రోడ్ల పక్కన తలదాచుకుంటున్న నిరాశ్రయుకులకు నిత్యం అన్నదానం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నది. లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ మాజీ గవర్నర్‌ పి.బసవేశ్వరరావు ఆధ్వర్యంలో రోజూ రెండు పూటలా లాక్‌డౌన్‌ బాధితులకు భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం గురువారం నాటికి 50వ రోజుకు చేరుకుంది. కరోనా వైరస్‌ ప్రబలకుండాప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించ డం, అధికార యంత్రాంగం సూచనలు, ఆదేశాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బోధన్‌ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం ఆరు వాహనాలను ప్రచార రథాలుగా తీర్చిదిద్ది, వాటి ద్వారా నిత్యం బోధన్‌, బాన్సువాడ, జుక్కల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ పిలుపుమేరకు ప్రత్యేకంగా రెండుసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించింది. ఇప్పటివరకు 8 వేల మాస్కులు, రెండు వేల మందికి శానిటైజర్లను పంపిణీచేసింది. 

కష్టకాలంలో ఆదుకోవాలన్న తపనతో..

లాక్‌డౌన్‌తో వలసకార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారికి భోజనం, అల్పాహారం అందించాలని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బోధన్‌ తరఫున నిర్ణయించుకున్నాం. 50 రోజులుగా నిరాశ్రయులు, వలస కార్మికులకు ఆహారాన్ని అందిస్తున్నాం.  

- పి.బసవేశ్వరరావు, లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ మాజీ గవర్నర్‌


logo