పూర్తిస్థాయిలో ధాన్యం కొంటాం

- రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
మామడ/నిర్మల్ : రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కరోనాతో విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ అమృత, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రాంకిషన్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చిక్యాల హరీశ్‌కుమార్, వైస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి, ఏవో నాగరాజు, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ గంగారెడ్డి, భాస్కర్‌రావు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధికి విరాళం అందజేత
సీఎం సహాయనిధికి నిర్మల్ ఫ్ల్లైవుడ్ అసోసియేషన్ సభ్యులు రూ.లక్ష విరాళం మంత్రికి నిర్మల్‌లోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
షార్ట్‌ఫిల్మ్ సీడీని విడుదల చేసిన మంత్రి
నిర్మల్‌కు చెందిన డాక్టర్ విజయ-రమేశ్‌రెడ్డి దంపతులు నిర్మించిన నిర్మల్ చరిత్ర, ఈ ప్రాంత విశేషాలతో కూడిన షార్ట్‌ఫిల్మ్‌ను మంత్రి అల్లోల తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.
తాజావార్తలు
- యాదాద్రి పనుల్లో వేగం పెంచాలి
- పూదోటల కిసాన్!
- హింస.. వారి కుట్రే
- రైతులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను నిరసించాలి
- పక్కా ప్రణాళికతో పట్టణాభివృద్ధి
- ప్రగతి పథంలో నూతన మున్సిపాలిటీ
- టీఆర్ఎస్ యూత్ మడిపల్లి అధ్యక్షుడిగా ప్రకాశ్‌గౌడ్
- పండ్ల మార్కెట్లో బినామీల దందా
- రోదసి టికెట్.. 400 కోట్లు!
- నేరుగా తాకలేదని వదిలేయలేం!