ప్రభుత్వం సూచించిన పంటలే సాగుచేయాలి

- శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ/బీర్కూరు : ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేయాలని రైతులకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి సాగుచేస్తే, పంటదిగుబడులకు మద్దతు ధర లభించకపోగా, రానున్న రోజుల్లో రైతుబంధు వంటి పథకాల లబ్ధిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సొసైటీ అధ్యక్షులు, సర్పంచులతో ఆయన సమావేశమయ్యారు. క్రాప్ కాలనీల ఏర్పాటు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మక్క కాంటాలు సకాలంలో పూర్తయినా లారీల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సొసైటీ చైర్మన్లు ఈ సందర్భంగా స్పీకర్‌కు వివరించగా, ఏం చేస్తున్నారంటూ రవాణాశాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న లారీల యజమానులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శరత్‌ను ఆదేశించారు. అనంతరం స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రాప్ కాలనీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని సూచించారు. త్వరలోనే మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నిజంసాగర్కు కాళేశ్వరం నీరు అందుతాయని, తద్వారా శాశ్వతంగా నీటి సమస్య దూరమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల ఆలయ ఆవరణలో బాన్సువాడ నియోజకవర్గంలోని ఏడు మండలాల వ్యవసాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో స్పీకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మంత్ర ఆఫ్ యూత్.. బై యూత్.. ఫర్ యూత్
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ