ఆదివారం 17 జనవరి 2021
Nirmal - May 12, 2020 , 01:56:40

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

నిర్మల్‌/నార్నూర్‌ : రూ. 25వేల లోపు పంట రుణాల మాఫీతో పాటుగా రైతుబంధు  నిధులు విడుదల చేసిందుకు గాను సోమవారం  సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పలువురు క్షీరాభిషేకం చేశారు. నిర్మల్‌లోని దివ్యాగార్డెన్‌లో మంత్రి అల్లోల, ఎమ్మెల్యే రేఖానాయక్‌, రైతులు, ప్రజాప్రతినిధులు  కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండల కేంద్రంలో జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌ కాంబ్లే, ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.