ఆదివారం 17 జనవరి 2021
Nirmal - May 12, 2020 , 01:56:43

పెట్టుబడికి ఢోకా లేదు..!

పెట్టుబడికి ఢోకా లేదు..!

  • రైతుబంధు నిధులు విడుదల 
  • త్వరలో రైతుల ఖాతాల్లో జమ
  • నిర్మల్‌ జిల్లాలో1.65 లక్షల మందికి లబ్ధి 

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : పంట పెట్టుబడుల కోసం అన్నదాతలకు రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా  ఎకరానికి యాసంగిలో రూ.5వేలు, వానాకాలంలో రూ.5 వేల చొప్పున ఎకరానికి అందిస్తూ వారికి ప్రభుత్వం ఆర్థిక ధీమాను కల్పిస్తున్నది. సీజన్‌ ప్రారంభం లో అందిస్తున్న ఈ సహాయం తో రైతులకు పెట్టుబడికి ఇబ్బం ది లేకుండా పోతున్నది. నిర్మల్‌ జిల్లాలో గతేడాది 1,38,898 మంది రైతులకు రూ.183.61 కోట్లు అందించారు. తాజాగా జిల్లాలో వానాకాలం సీజన్‌ కోసం 1.65 లక్షల మంది రైతులకు ఈ ఆర్థిక సాయం అందనుంది. గతంలో జూన్‌ 10, 2019 నాటికి మ్యుటేషన్‌ అయిన భూములకు కటాఫ్‌ తేదీగా నిర్ణయించి ఆర్థిక సహాయం అందించారు. తర్వాత క్రయ విక్రయాలు జరిగి మ్యుటేషన్‌ అయిన భూములకు ఈసారి ఆర్థిక సహాయం చేస్తుండగా.. ఇందుకు సంబంధించి కటాఫ్‌ తేదీ ప్రకటించనున్నారు. ఆ లోపు జరిగిన మ్యుటేషన్‌, క్రయ విక్రయాలకు సంబంధించి సీసీఎల్‌ఏ ద్వారా వివరాలను వ్యవసాయశాఖ ఎన్‌ఐసీకి పంపనుంది. కరోనా వైరస్‌ విజృంభణతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.