శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - May 10, 2020 , 02:39:04

రైతులు ఆందోళన చెందొద్దు

రైతులు ఆందోళన చెందొద్దు

  • ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

భైంసా  : రైతులు ఆందోళన చెందొద్దని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. భైంసాలోని మార్కెట్‌ యార్డు ఓపెన్‌ గోదాము లో నిల్వ చేసిన మక్కలను ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. అనంతరం మార్కె ట్‌ కమిటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు రెండున్నర నుంచి మూడు లక్షల క్వింటాళ్ల వరకు మక్కలను విక్రయించేందుకు తీసుకురావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పంట దిగుబడుల కొనుగోళ్ల కోసం అధికారులు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు మురళీగౌడ్‌, కృష్ణ, దత్తురాం పటేల్‌, సంజీవ్‌రెడ్డి, రమణరెడ్డి, సోలంకి భీంరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులున్నారు.logo