బుధవారం 27 జనవరి 2021
Nirmal - May 09, 2020 , 01:49:38

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నమస్తే తెలంగాణ యంత్రాంగం: ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి ని జామాబాద్‌ జిల్లాల్లో మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్ర వారం అధికారులు, ప్రజాప్రతినిధు లు ప్రారంభించారు. ఆదిలాబాద్‌ జి ల్లా ఇంద్రవెల్లిలో  మక్కల కొనుగో లు కేంద్రాన్ని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ ప్రారంభించారు. నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం ఝరి (బి) లో ఎమ్యెల్యే విఠల్‌రెడ్డి మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. భైంసా మండలం ఇలేగాం, దేగాం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలను సర్పంచులు  ప్రారంభించారు. లోకేశ్వరంలో మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు పరిశీలిం చారు. భైంసాలోని  జిన్నింగ్‌ ఫ్యాక్టరీలను మక్కలు  నిల్వ చేసేందుకు ఆయన పరిశీలించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలో ఇటీవల వర్షంతో తడిసిన ధాన్యాన్ని సొసైటీ చైర్మన్‌ నర్సింహారెడ్డి పరిశీలించారు. ఎల్లారెడ్డి మండలం మౌలాన్‌ఖేడ్‌లో కొనుగోలు సబ్‌సెంటర్‌ను సొసైటీ చైర్మన్‌ నర్సింహులు ప్రారంభించారు. కామారెడ్డి మండలం బస్వన్నపల్లిలో, నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం యాద్గార్‌పూర్‌లో కొనుగోలు కేంద్రాలు  ప్రారంభమయ్యాయి.


logo