సోమవారం 13 జూలై 2020
Nirmal - May 09, 2020 , 01:49:50

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌

  • ‘కరోనా’ ఇబ్బందులు ఉన్నా.. రూ. 8,200 కోట్లు విడుదల
  • ఉచిత విద్యుత్‌కు కోతపెట్టే యోచనలో కేంద్రం
  • కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం
  • విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: రాష్ట్రం లో కరోనా వైరస్‌తో ఇ బ్బందులు ఉన్నప్పటికీ రై తు రుణమాఫీ, రైతుబం ధు కోసం రూ. 8,200 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌ రైతుపక్షపాతి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌, రాథోడ్‌ బాపురావుతో కలిసి నిర్మల్‌ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్‌తో ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ రూ. 8200కోట్లు విడుదల చేశారన్నారు. దీంతో గ్రామీణ ప్రాంత రైతాంగంలో సంతోషం వ్యక్తమవుతున్నదన్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ కోసం నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నిర్మల్‌ జిల్లాలో 15 రోజులుగా కరోనా కొత్త కేసులు నమోదు కాలేవని, త్వరలోనే జిల్లా గ్రీన్‌జోన్‌లోకి వెళ్తుందని చెప్పారు. వైరస్‌ తీవ్రత తగ్గిందని భావించి విచ్చలవిడిగా తిరుగకుండా మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా నియంత్రణకు  ప్రజలు ఇ చ్చిన సహకారం చాలా గొప్పదన్నారు. రైతులు ఇబ్బంది పడకుం డా అన్ని చర్యలు చేపట్టామని, 24 గంటల ఉచిత విద్యుత్‌, సాగునీ రు, పెట్టుబడికి డబ్బులు ఇవ్వడం తో పంటలు బాగా పండుతున్నా యన్నారు. జిల్లాలో లక్ష మెట్రిక్‌ టన్నుల మక్కలకు గాను ఇప్పటికే 50వేల మెట్రిక్‌ టన్నులు  కొనుగోలు చేశామన్నారు.  జిల్లాలో లక్ష ఎకరాల్లో ధాన్యం సాగుచేయగా.. ఇప్పటికే 117 కేంద్రాల ద్వారా ధాన్యం కొంటున్నామని తెలిపారు.   

నిర్మల్‌లోనే ఎస్సెస్సీ మూల్యాంకనం 

నిర్మల్‌ జిల్లాలోనే పదోతరగతి జవాబుపత్రాలను మూల్యాంకనం చేసేందుకు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి అనుమతి తెచ్చినట్లు మంత్రి అల్లోల వెల్లడించారు. ఇంటర్‌కు సంబంధించి కూడా ఆ శాఖ సెక్రటరీతో మాట్లాడామని, రెండు రోజుల్లో అనుమ తి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ సవరణ బిల్లు-2020 రైతులకు, సామా న్య ప్రజలకు శాపంగా మారనుందని మంత్రి విమ ర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుంటే విద్యుత్‌ సవరణ చట్టం పేరుతో ఉచిత కరెంట్‌కు కోత పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడం బాధాకరమన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేందర్‌, ఎఫ్‌ఎసీఎస్‌ చైర్మన్‌ రాజేందర్‌, హరీశ్‌రావు, రాంకిషన్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, మారుగొండ రాము, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు

  • సిబ్బందికి సీఎం కేసీఆర్‌ అభినందన

లాక్‌డౌన్‌ సమయంలో నిర్మల్‌ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 102, 108 వాహనాలు గర్భిణులు, బాలింతలను దవాఖానాలకు తీసుకెళ్లాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో జిల్లాలో 1636 ప్రసవాలు జరగగా, ఇందులో ప్రభుత్వ దవాఖానల్లో 1060, ప్రైవేటు దవాఖానలో 576 ప్రసవాలు జరిగాయి.ఈ విషయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ వైద్యులు, సిబ్బందిని అభినందించారు. 


logo