సోమవారం 25 జనవరి 2021
Nirmal - May 07, 2020 , 01:28:53

వైరస్‌ నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలి

వైరస్‌ నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలి

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ/సారంగాపూర్‌: కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మున్సిపల్‌ కమిషనర్‌, పోలీసు, వైద్య, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. దుకాణాలను సరి, బేసి విధానం ద్వారా తెరిచేందుకు అనుమతించాలని సూచించారు.  సమావేశంలో ఎస్పీ శశిధర్‌ రాజు, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం సారంగాపూర్‌ మండలంలోని కౌట్ల(బీ)లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని, తహసీల్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.


logo