శనివారం 16 జనవరి 2021
Nirmal - May 07, 2020 , 01:28:54

అన్నదానాలు.. సరుకుల పంపిణీ

అన్నదానాలు.. సరుకుల పంపిణీ

నమస్తే తెలంగాణ యంత్రాంగం: నిజామాబాద్‌ నగరంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం బుధవారం 36వ రోజుకు చేరుకుంది. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు, నేతలు వలస కార్మికులకు అన్నం ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లను అందజేశారు. న్యాల్‌కల్‌ రోడ్డులో వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బోధన్‌ పట్టణం బీటీనగర్‌లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు నిరుపేదలకు సరుకులు అందజేశారు. క్వారంటైన్‌ ప్రాంతాల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి  పీఆర్టీయూ బోధన్‌ మండల అధ్యక్షుడు శంకర్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కమ్మర్‌పల్లిలో నిరుపేద నాయీబ్రాహ్మణ కుటుంబాలకు ఎస్సై ఎండీ ఆసిఫ్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ము ప్కాల్‌, మెండోరా మండల కేంద్రాల్లో 12వ రోజు వలస కూలీలకు ఉపాధ్యాయులు అన్నదానం చేశారు. భీమ్‌గల్‌లో క్రిస్టియన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజశ్రీ, కోటగిరి, రుద్రూర్‌ మండలాల్లో పోచారం ట్రస్టు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, కామారెడ్డిలో గణపతి సచ్చిదానంద వలంటీర్లు, ఆశ్రమ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జాహ్నవి, వైస్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రభుత్వ ద వాఖానలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నదానం చేశారు. దోమకొండలో ఎంపీపీ కోట సదానంద నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం లో బీసీ వెల్ఫేర్‌, బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్లు ఆశన్న, ప్రవీణ్‌, ఉట్నూర్‌ మండలం హస్నాపూర్‌లో ఎంపీటీసీ శారద, శ్రీ స త్యసాయి సేవాసమితి, ఎమ్మార్పీఎస్‌ నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బీసీ బాలికల వసతిగృహం, పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో టీఎన్జీవో నాయకులు అన్నదానం చేశారు. నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం పార్డి(బీ) గ్రామంలోని రేషన్‌ షాపుల వద్ద టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి తూం రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో పేదల కోసం బియ్యం సేకరించారు.