సమర్థవంతమైన చర్యలతో బాన్సువాడలో కరోనాను కట్టడి చేశాం

- స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ, నమస్తే తెలంగాణ/రుద్రూర్/కోటగిరి: సమర్థవంతమైన చర్యలతోనే బాన్సువాడ పట్టణంలో కరోనా మహమ్మారిని అదుపులో ఉంచగలిగామని శాసససభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలోని తన ఇంటివద్ద గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ, పోచారం ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను కలెక్టర్ శరత్, జేసీ యాదిరెడ్డితో కలిసి ఆయన అందజేశారు. అనంతరం పట్టణంలోని ఆయా కాలనీల్లో కలియతిరిగారు. పోచారం ట్రస్టు ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి అందజేసిన బూమ్ స్ప్రేయర్ యంత్రాన్ని పరిశీలించారు. అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ దామోదర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంజిరెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు.
పేదలను ఆదుకుందాం..
ఆర్థికంగా ఉన్నవారు లాక్డౌన్ సమయంలో పేదలను తోచినకాడికి ఆదుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రాయకూర్‌లో పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అందరూ సామాజిక దూరాన్ని పాటించి కరోనాను పారదోలాలని పిలుపునిచ్చారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి బల్లులు త్వరలో చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఆర్డీవో గోపీరాం, డీఎస్వో హరికృష్ణ, జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాత, ఏఎంసీ చైర్మన్ సంజీవ్, సర్పంచ్ నిర్మల రమేశ్, హౌసింగ్ ఏఈ నాగేశ్వర్రావు, తహసీల్దార్ యాదగిరి, కోప్షన్ సభ్యుడు మస్తాన్, పీఏసీఎస్ చైర్మన్ సంగమేశ్వర్, సంజీవ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, పత్తి రాము, సర్పంచ్ గంగారాం, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్