కరోనా నియంత్రణ చర్యల్లో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం

- మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ అర్బన్,నమస్తే తెలంగాణ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని, ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ కన్వీనర్లకు ఐకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులను మంత్రి పంపిణీ చేశారు.
అన్నదాన కేంద్రం ప్రారంభం
సోన్ : నిర్మల్ జిల్లా సరిహద్దులోని సోన్ వద్ద ఐకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలకు, లారీ డ్రైవర్లకు భోజనం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ సేవా దృక్పథం అలవర్చుకోవాలని మంత్రి అన్నా రు. ఐకేఆర్ ఫౌండేషన్ కన్వీనర్ అల్లోల గౌతంరెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, సర్పంచ్ వినోద్‌కుమార్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేత
సోన్ మండలంలోని గంజాల్ గ్రామానికి చెందిన శైలు అనే విద్యార్థిని కుటుంబానికి రూ. 2.50 లక్షల ఎల్వోసీ ప్రొసీడింగ్ కాపీని మంత్రి అల్లోల ఆదివారం అందజేశారు. విద్యార్థిని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. దవాఖానలో చికిత్స చేయించుకొని సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి విద్యార్థి కుటుంబానికి ప్రొసీడింగ్ కాపీని అందజేశారు.
తాజావార్తలు
- 'హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌ను తలదన్నేలా సిద్దిపేట నెక్లెస్‌రోడ్'
- రిపబ్లికన్ నేత ట్విట్టర్ అకౌంట్ లాక్.. ఎందుకో తెలుసా ?
- బూర్గుల నర్సింగరావు మృతి.. కేటీఆర్ సంతాపం
- కమెడీయన్స్ గ్రూప్ ఫొటో.. వైరల్‌గా మారిన పిక్
- ఇక మీ ఇష్టం.. ఏ పార్టీలో అయినా చేరండి!
- వాఘాలో ఈ సారి బీటింగ్ రిట్రీట్ ఉండదు..
- గుంటూరు జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- ప్రత్యేక గుర్తింపుకోసమే అంగన్వాడీలకు యూనిఫాం
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
- పెంపుడుకుక్కకు అంత్యక్రియలు...!