మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Mar 09, 2020 , 23:33:07

ఘనంగా హోలీ వేడుకలు

ఘనంగా హోలీ వేడుకలు

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఆర్‌హెడ్‌ క్వార్టర్‌ నుంచి పోలీసులు బ్యాండ్‌ మేళాలతో నృత్యాలు చేస్తూ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఎస్పీ విష్ణువారియర్‌కు పోలీసులు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పోలీసులతో కలిసి ఎస్పీ నృత్యాలు చేశారు. అక్కడి నుంచి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావుతో కలిసి హోలీ వేడుకలను జరుపుకొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు పండగను సంతోషంగా జరుపు కోవాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షాలు తెలిపారు. ప్రజలు హోలీ ఆడిన తర్వాత చెరువులు, కుంటలు, జలపాతల వద్దకు స్నానానికి వెళ్లవద్దని సూచించారు. ఇంటి వద్దే హోలీ వేడుకలు జరుపుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రావ్‌, సీఐలు సురేశ్‌, పోతారం శ్రీనివాస్‌, పురుషోత్తమాచారి, ఎస్సులు, హెడ్‌కానిస్టెబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.logo
>>>>>>