బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Mar 09, 2020 , 23:32:15

కన్నుల పండువగా మల్లన్న కల్యాణం

కన్నుల పండువగా మల్లన్న కల్యాణం

బోథ్‌, నమస్తే తెలంగాణ : మండలంలోని కౌఠ (బీ) గ్రామంలో సోమవారం మల్లన్న స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నూతన ఆలయం నిర్మించనున్న స్థలంలో కల్యాణాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన మల్లన్న భక్తుడు వడ్ల శ్రీనివాస్‌ గ్రామస్తుల సహకారంతో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణం నిర్వహించే స్థలంలో పట్నం వేశారు. మల్లన్న దేవుడితో గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మకు కల్యాణం జరిపారు. వేద పండితులు మంత్రాలు చదవగా మల్లన్న దేవుడి అనుమతితో ఇద్దరి మెడలో తాళి వేశారు. కార్యక్రమానికి గ్రామంతో పాటు కన్గుట్ట, పొచ్చెర, సొనాల, బోథ్‌, ఇచ్చోడ తదితర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. అంతకుముందు గ్రామదేవతకు బోనాలు వేశారు. కార్యక్రమంలో భక్తులు అర్జున్‌, బక్కన్న, రాజు, గొల్ల నర్సయ్య, సాయన్న, దిగంబర్‌, శ్రీకాంత్‌, మహిళలు పాల్గొన్నారు. logo