శుక్రవారం 05 జూన్ 2020
Nirmal - Mar 09, 2020 , 01:34:00

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

నకిరేకల్‌, నమస్తేతెలంగాణ : మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, రాజకీయపరంగా అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. మహిళలు తమ ప్రయత్నంలో ఎక్కడా ధైర్యం చెదరకుండా ముందుకు సాగాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పూజర్ల శంభయ్య, కొండా వెంకన్న,  వార్డు సభ్యులు చెవుగోని రజిత, బొక్కా జయమ్మ, వంటెపాక సరోజ, టీఆర్‌ఎస్‌ నాయకులు గుత్తా మాధవరెడ్డి, గంగాధర పద్మావతి, పందిరి యాదమ్మ, పన్నాల అనసూర్యమ్మ, షబానా పాల్గొన్నారు.

    గ్రామ పంచాయతీ కార్యాలయంలో ...

పట్టణంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ పన్నాల రంగమ్మ, మహిళా వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ మంగినపల్లి రాజు, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

   మహిళలు ఆత్మైస్థెర్యంతో ముందుకుసాగాలి 

నార్కట్‌పల్లి : మహిళలు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలని తాసిల్దార్‌ రాధ అన్నారు. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బస్‌ డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ముందుకు రావాలని అన్నారు. మహిళలకు రక్షణగా అనేక చట్టాలు వచ్చాయని వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగ పర్చుకోవాలని అన్నారు. మహిళలు స్వశక్తితో ముందకు సాగినప్పుడే సమాజంలో అరుదైన గౌరవం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌, కండక్టర్లు పాల్గొన్నారు.

    కట్టంగూర్‌లో...

కట్టంగూర్‌ : మండలంలోని ఇస్మాయిల్‌పల్లి, గార్లబాయిగూడెం గ్రామాల్లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు పులిగిల్ల అంజయ్య, బోడ సరిత మాట్లాడుతూ నేటి మహిళలకు ఎనలేని శక్తి ఉందని, తమ సామర్థ్యాలను వినియోగించుకొని ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘబంధం అధ్యక్షురాలు పులిగిల్ల లింగమ్మ, అంగన్‌వాడీ టీచర్‌ గోదల పరమేశ్వరీ, తుమ్మల పార్వతమ్మ, నిర్మల, పెంజర్ల అనిత, జుజాత, నాగమణి, జనార్ధన్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

     కేతేపల్లిలో...

కేతేపల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మండల కేంద్రంలో వ్యవసాయకార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ చినవెంకులు మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని కోరారు. అనంతరం స్థానిక సర్పంచ్‌ జటంగి ముత్తమ్మ, వార్డు సభ్యులు స్వాతి, వెంకటమ్మలను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో బోళ్ల నర్సింహారెడ్డి, లూర్దుమారయ్య, సుధీర్‌, చౌడయ్య, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.


logo