మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Nirmal - Mar 09, 2020 , 01:34:59

ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల పందేలు

ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల పందేలు

పెద్దవూర : పెద్దవూర మండలంలోని బట్టుగూడెం గ్రామంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందేలు ఆదివారం ముగిశాయి. శనివారం జరిగిన పందేల్లో  సీనియర్‌ సైజు విభాగంలో కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన కాసనేని పావనచౌదరి ఎడ్లు 2700అడుగుల దూరం లాగి మొదటి బహుమతి రూ.65,016 గెలుచుకున్నారు. రెండవ బహుమతి గుంటూరు జిల్లా బురుజుపల్లికి చెందిన ఎర్రమాల సోహిత్‌రెడ్డి ఎడ్లు 2618అడుగుల దూరన్ని లాగి రూ.51,016 గెలుచుకోగా, మూడో బహుమతి గుంటూరు జిల్లా తోట్ల వల్లూరుకు చెందిన బద్దిగం సుబ్బారెడ్డి ఎడ్లు 2218 అడుగుల దూరం లాగి రూ.35,016 గెలుచుకున్నారు. నాల్గో బహుమతి ఉరవకొండకు చెందిన కే.నిస్సార్‌ ఎడ్లు 2209 అడుగుల దూరం లాగి రూ.25,016 గెలుచుకోగా, ఐదో బహుమతి కర్నూల్‌ జిల్లాకు చెందిన ఎస్‌.శివారెడ్డి ఎడ్లు 1411.0  అడుగుల దూరం లాగి  రూ.15,016 గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చెన్ను అనురాధ, నిబ్మనూర్‌ బార్‌ అసోసిషన్‌ అధ్యక్షుడు ఎంసీ కోటిరెడ్డి, రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయ భాస్కర్‌రెడ్డి, నిర్వహకులు సర్పంచ్‌ చామకురి చిన లింగారెడ్డి, పెద్దవూర ఉపసర్పంచ్‌ నడ్డి లింగయ్య, పెద్దవూర ఎస్సై ఎల్‌.మౌనిక  కమిటీ  సభ్యులు చెన్ను వెంకట్‌రెడ్డి, వీరారెడ్డి, చెన్ను విజయ్‌రెడ్డి, కూన్‌రెడ్డి మధుసూదన్‌రెడ్డి, బొంగరాల వెంకటేశ్వర్లు, కటకొండ సాంబయ్య, పరమేశ్‌, బొంగరాల రామయ్య, లక్కలింగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, కత్తి ప్రభాకర్‌రెడ్డి, రాహుల్‌రెడ్డి, రాములు పాల్గొన్నారు.


logo