గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Mar 08, 2020 , 23:58:00

అసమానతలు తొలగాలి..

అసమానతలు తొలగాలి..

ఎదులాపురం: అసమానతలు రూపుమాపి, అడ పిల్లలను మగవారితో సమానంగా చదివించి సమాన అవకాశాలు కల్పించినపుప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి అన్నారు. ఆదివారం పట్టణంలోని టీడీడీసీ కేంద్రంలో మహిళా దినోత్సవాన్ని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...   ప్రస్తుతం ఆడ పిల్లల్లో అక్షరాస్యత 61 శాతం, మగ పిల్లల్లో 81 శాతం ఉందన్నారు. 5-14 ఏండ్ల పిల్లలందరికీ ఉచిత నిర్భంద విద్యను అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమలు నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు.  ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.  ఆడ పిల్లలపై ఆంక్షలు విధించకుండా మంచి, చెడు విషయాలను గ్రహించేలా, భయం వీడి ప్రశ్నించే తత్వాన్ని అవర్చాలని తల్లిదండ్రులకు సూచించారు.  ఆడపిల్లలు అపదలో ఉంటే 100 లేదా 181 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతకు ముందు పలువురు మహిళలు వారి అభిప్రాయాలు పంచుకున్నారు. మహిళా ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్డీవో రాజేశ్వర్‌రాథోడ్‌,  జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి తొడసం చందు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, ఐసీడీఎస్‌ పీడీ మిల్కా, జిల్లా పశు సంర్ధక శాఖ ఆధికారి సురేశ్‌, ఎఫ్‌ఆర్వో అరుణ, ట్రెజరీ ఉప సంచలకుడు నాగరాజ్‌, తలమడుగు ఎస్సై దివ్యభారతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.logo
>>>>>>