మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Mar 08, 2020 , 23:20:51

‘సీపీఎస్‌ను రద్దు చేయాలి’

‘సీపీఎస్‌ను రద్దు చేయాలి’

 ఆదిలాబాద్‌ రూరల్‌: ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేయాలని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూహౌసింగ్‌బోర్డు సంఘ కార్యాలయంలో మాట్లాడారు. 2004 సెప్టెంబర్‌ ఒకటి తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి సీపీఎస్‌ విధానంతో రిటైర్‌ అయితే నెలకు కనీసం 5 వేల పింఛన్‌ కూడా వచ్చే పరిస్థితిలేదన్నారు. కనీసం గ్రాట్యూటీ సౌకర్యం కూడా లేక పోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు భయాందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జాదవ్‌ కిరణ్‌ కుమార్‌, సాగర్‌రెడ్డి, మహేశ్వర్‌, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>