శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Mar 08, 2020 , 00:42:21

దివ్యాంగులకు ‘ఉపాధి’ ఊతం

దివ్యాంగులకు ‘ఉపాధి’ ఊతం

సారంగాపూర్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దివ్యాంగులకు ఆపన్న హస్తం అందించింది. ఆర్థిక సంవత్సరంలో దివ్యాంగుల కుటుంబానికి వంద రోజులకు అదనంగా 50 పని రోజులు కలుపుతూ 150 రోజుల పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. శ్రమకు తగిన ప్రతి ఫలం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో దివ్యాంగుల కూలీల్లో భరోసా నెలకొంది. జాబ్‌కార్డు గల ప్రతి దివ్యాంగుడి కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.జిల్లాలోని 18 మండలాల్లో 396 గ్రామపంచాయతీలు ఉండగా 320 జీపీల్లో మాత్రమే పనులు కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 262 శ్రమశక్తి సంఘాల పరిధిలో 2804 మందికి జాబ్‌ కార్డులు మంజూరయ్యాయి. 1420 మంది దివ్యాంగ కూలీలు ఉపాధి పొందుతున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఉపాధి హామీ పని దినాలు పెంచడంప జిల్లాలోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


logo