మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Mar 08, 2020 , 00:33:49

ఉత్సాహంగా 2కే రన్‌

ఉత్సాహంగా 2కే రన్‌

చిన్ననాటి నుంచే ఆత్మరక్షణ  విద్యలు నేర్చుకోవాలనిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ: చిన్నప్పటి నుంచే మహిళలు, యువతులు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ఎస్పీ శశిధర్‌ రాజు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పోలీస్‌ శాఖ ఆద్వర్యంలో స్థానిక ఎన్టీఆర్‌ మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన 2కే రన్‌ కార్యక్రమాన్ని జెండా ఊపి ర్యాలీని ప్రారంబించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా రన్‌ కొనసాగి ఎన్టీఆర్‌ మినీస్టేడియానికి చేరుకుంది. వారు మాట్లాడుతూ.. మహిళలు, యువతులు షీటీం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనుకోని సమయంలో ఆపదవస్తే డయల్‌ 100నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.  స్త్రీలు, పురుషులకు సమానంగా ఉండాలని, అప్పుడే అందరికీ సమానంగా ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. మహిళలు తలుచుకుంటే అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్మల్‌ ఆర్డీవో ప్రసూనాంబను పూలమాల ,శాలువాతో సన్మానించారు. హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థినిని శ్రీలత ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు శ్రీనివాస్‌ రావు, వెంకట్‌ రెడ్డి, నిర్మల్‌ ఆర్డీవో ప్రసూనాంబ, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌, సీఐలు జాన్‌దివాకర్‌, జీవన్‌ రెడ్డి, ఆర్‌ఐ వెంకటి, షీ టీం ఎస్సై అంజమ్మ, ఎస్సైలు విద్యార్థులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


logo
>>>>>>