ఆదివారం 24 మే 2020
Nirmal - Mar 07, 2020 , 00:01:25

కొవిడ్‌ -19పై అప్రమత్తంగా ఉండాలి

కొవిడ్‌ -19పై  అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయమూర్తి ఎంజీ.ప్రియదర్శిని అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం కరోనా వైరస్‌ నియంత్రణకు హోమియోపతి మందులు, మాస్కులను ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. బయటకు వెళ్లివచ్చిన తర్వాత పరిశుభ్రంగా కాళ్లు, చేతులను సబ్బుతో కడగాలన్నారు. వివిధ కేసుల్లో కోర్టుకు హాజరవుతున్న వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. విదేశాలు, ఇతర రాష్ర్టాలకు వెళ్లి వచ్చేవారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాశ తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని దవాఖానల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచారని తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. వదంతులను నమ్మవద్దని పేర్కొన్నారు.  అప్రమత్తంగా ఉంటే కరోనా వైరస్‌ ప్రబలదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి టి.శ్రీనివాస్‌రావ్‌, న్యాయమూర్తులు అరుణాకుమారి ఉదయభాస్కర్‌, జయప్రకాశ్‌రావ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహన్‌సింగ్‌, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది, న్యాయవాదులు ఉన్నారు.


logo