శనివారం 28 మార్చి 2020
Nirmal - Mar 05, 2020 , 00:51:56

ఇంటర్‌ పరీక్షలు షురూ

ఇంటర్‌ పరీక్షలు షురూ

నిర్మల్‌ అర్బన్‌ /నమస్తే తెలంగాణ : జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా 7380 మంది విద్యార్థులకు గాను 6,924 మంది పరీక్షకు హాజరుకాగా 456 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి అలెగ్జాండర్‌ తెలిపారు. జిల్లాలోని 19 మండలాల్లలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా ఉండేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలో  సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. నిమిషం నిబంధన అమలుచేయడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. జిల్లాలో నిమిషం నిబంధనతో ఎవరూ వెనుదిరగలేరని ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారితెలిపారు.జిల్లా కేంద్రంతోపాటు ముథోల్‌, భైంసాలోని పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్‌ స్కాడ్‌లు తనిఖీ చేశారు. ఖానాపూర్‌లో పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తనిఖీ చేశారు.


నేడు ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం

ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 7,060 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాన్నారు. logo