గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Mar 05, 2020 , 00:48:15

అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ

అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ:  ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల వైద్యాధి కారులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించిన పక్షంలో వారికి జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖా నలో అత్యవసర వైద్యం అందించేందుకు ఆరు పడకల ఐసోలేషన్‌ గదిని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ముగ్గు రు ప్రత్యేక  వైద్యులను నియమించారు. ఒక నర్సుతో పాటు మరో ముగ్గురు ఇతర టెక్నికల్‌ సిబ్బందిని ఏర్పా టు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా లక్షణాలు బయటకు రాకున్నప్పటికీ భవిష్యత్‌లో ఎవరికైనా సోకితే దాన్ని కట్టడి చేసేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. 


ప్రజల అప్రమత్తత అవసరం

జిల్లాలో వైద్యులు కూడా కరోనా వైరస్‌ సోకకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు ప్రారంభిం చారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైరస్‌ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రూపొం దించిన కరపత్రాలు, సామాజిక మాధ్యమాల ద్వారా వైరస్‌ సోకడానికి గల కారణాలు, వాటి నివారణ పద్ధతులపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు చెందిన అనేక మంది గల్ఫ్‌ దేశాలతో పాటు ముంబై, హైదరాబాద్‌, బెంగళూర్‌ తదితర ప్రాంతాల్లో నివాసముంటూ అక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన వారు ఇక్కడికి వస్తే ఆ వైరస్‌ వచ్చే అవకాశం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 


కనీస జాగ్రత్తలు అవసరం

వైరస్‌ సోకకుండా ఉండేందుకు కనీస జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యాధికి దూరంగా ఉండాలంటే వ్యక్తుల మధ్య కరచాలనం చేయవద్దని, ముఖానికి మాస్క్‌లు ధరించాలని, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో దూరంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వైరస్‌ సోకిన వ్యక్తులను గుర్తించే లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.  జలుబు, జ్వరం, దగ్గు, దమ్ము, అస్తమా వంటి లక్షణాలతో బాధపడుతూ వారం రోజుల పాటు ఇవే లక్షణాలుంటే వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.కరోనా వైరస్‌పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. దానిని సకాలంలో గుర్తిస్తే సరైన వైద్యం అందించి రోగికి పూర్తి ఆరోగ్యభరోసా కల్పిస్తామని వైద్యులు పేర్కొంటున్నారు. వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు నిర్దారణకు వస్తే వాటిపై హైదరాబాద్‌ ప్రత్యేక లాబోరే టరికి సిఫార్సు చేసి అక్కడ నిర్ధారణ అయిన వెంటనే అత్యవసర చికిత్స అందిస్తారన్నారు. 


logo
>>>>>>