సోమవారం 18 జనవరి 2021
Nirmal - Mar 02, 2020 , 23:16:55

పేద విద్యార్థుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పేద విద్యార్థుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ఆదిలాబాద్‌ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే పేద విద్యార్థుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు.  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వచ్చే రెండు నెలల పాటు మధ్యాహ్న భోజనం కోసం కలెక్టర్‌ నిధుల నుంచి రూ.5లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం విద్యార్థులకు వడ్డించి వారితో భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కడుపునిం డా తింటేనే చదువుపై మనస్సు లగ్నం చేయగలుగుతారన్నారు.  కలెక్టర్‌ నిధుల నుంచి రూ.5లక్షలు ఇప్పిచ్చామన్నారు. ప్రభుత్వం కేజీ టూ పీజీలో భాగంగా గురుకులాలను ఏ ర్పాటు చేసిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి కష్టాలున్నా తన దృష్టికి తీసుకువస్తే వీలైనంత వరకు సహాయం చేస్తామన్నారు. కలెక్టర్‌ నిధుల్లోంచి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు రూ.2లక్షలు, శాంతినగర్‌లోని డిగ్రీ కళాశాలకు రూ.3లక్షలను మధ్యాహ్న భోజనం కోసం కేటాయించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రతాప్‌సింగ్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.