మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Mar 01, 2020 , 23:25:12

వాడ వాడలా ‘ప్రగతి’

వాడ వాడలా ‘ప్రగతి’

ఆదిలాబాద్‌ / నమస్తేతెలంగాణ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమం ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో వాడ వాడలా జోరుగా సాగుతున్నది. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డుల్లో ఆదివారం ఈ కార్యక్రమం ఏడో రోజూ కొనసాగింది.  మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో ఉదయం ఏడు గంటల నుంచి వార్డులకు నియమించిన ప్రత్యేకాధికారులు, కౌన్సిలర్లు, స్థానికులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. కార్యక్రమంలో షెడ్యూల్‌ ప్రకారం ఏడో రోజూ హరిత ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో నాటిన మొక్కల చనిపోగా వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటారు. అధికారులు, కౌన్సిలర్లు స్థానికులతో కలిసి హరితహారంలో భాగంగా జూన్‌లో నాటాల్సిన మొక్కల డిమాండ్‌ను గుర్తించారు. వివిధ వాడల్లో ఖాళీ స్థలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో మొక్కల పెంపకంలో భాగంగా నర్సరీల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తించే కార్యక్రమం నిర్వహించారు. 

స్థానికుల సహకారం..  

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో ఏడు రోజులుగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఆయా వార్డులకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో  భాగస్వాములవుతున్నారు. రోజూ ఉదయం వార్డు లో చేపడుతున్న కార్యక్రమాలకు హాజరవుతూ షెడ్యూల్‌ ప్రకారం ఆ రోజు చేప ట్టే పనుల్లో పాల్గొంటున్నారు. మురికిమయంగా మారిన వార్డుల్లో పరిశుభ్రత నెలకునేలా అధికారులు, కౌన్సిలర్‌లతో కలిసి కృషి చేస్తున్నారు. మహాలక్ష్మి వాడలో కలెక్టర్‌ శ్రీదేవసేన అధికారులతో కలిసి వార్డులో తిరిగారు. అక్కడ నాటిన మొక్కలకు నీరు పోశారు. పరిశుభ్రత,  పచ్చదనం లాంటి విషయాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. దస్నాపూర్‌, రిక్షాకాలనీ, న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీల్లో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ పర్యటించి పనులను పరిశీలించారు. వార్డుల్లో చెత్త, చెదారాన్ని తొలగించడం, మొక్కలు నాటడం, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడం లాంటి వాటితో పాటు కళాకారులతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. logo
>>>>>>