శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Mar 01, 2020 , 23:21:44

ముమ్మరంగా నిరక్ష్యరాస్యుల సర్వే

ముమ్మరంగా నిరక్ష్యరాస్యుల సర్వే

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ :  నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిరక్ష్యరాస్యులను గుర్తించాలని బల్ద్దియాలకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 49 వార్డుల్లో 48,720 కుటుంబాలు ఉండగా.. ఇంటింటా సర్వేకు 77 మంది ఆర్పీలు (రిసోర్స్‌ పర్సన్స్‌) నియమించారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆర్పీలు గత నెల 24 నుంచి సర్వేను ప్రారంభించారు. ఇప్పటి వరకు 8,500మంది నిరక్ష్యరాస్యులను గుర్తించగా..ఆన్‌లైన్‌ వివరాలను నమోదు చేస్తున్నారు. 

ఈ నెల 4 వరకు సర్వే..

నిరక్ష్యరాస్యుల సంఖ్య తగ్గించడం.. అక్షరాస్యత శాతం పెంపునకు ప్రణాళిక రూపొందించి వంద శాతం అక్షరాస్యులను చేయాలనే కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిరక్ష్యరాస్యులను గుర్తించడానికి సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు బల్ద్దియాలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా..ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 49 వార్డుల్లో 48,720 కుటుంబాల్లో  సర్వే ప్రారంభించారు. 77 మంది ఆర్పీలకు వార్డులను విభజించారు. ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఎంత మంది ఉన్నారు..ఎవరెవరు చదువుకున్నారు, ఎంత వరకు, వృత్తి ఏమిటి, ప్రవృత్తి ఏమిటి అనే అంశాలు నమోదు చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేసుకొని డీఎంఏ వెబ్‌సైట్‌లో రోజు వారీ వివరాలను నమోదు చేస్తున్నారు. ఆదివారం వరకు 8,500 మంది నిరక్ష్యరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. 

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం..

వంద శాతం అక్షరాస్యత సాధించడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ప్రాంతాల వారీగా ప్రతి వంద మందికి ఒక కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ఒక ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు చదువుకున్న వారైతే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులకు వీరే చదువు చెప్పి అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 


logo