బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Mar 01, 2020 , 23:20:57

పరిసరాల శుభ్రత అందరి బాధ్యత

పరిసరాల శుభ్రత అందరి బాధ్యత

ఎదులాపురం : పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌ ఆవరణలో వార్డు కౌన్సిలర్‌ భరత్‌కుమార్‌తో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. పల్లెప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇంటి ఎదుట ప్రజలు చెత్తాచెదారం వేయకుండా మున్సిపల్‌ వాహనాల్లో వేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు దీవిటి రాజు, అనిల్‌, స్టడీ సర్కిల్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.

ఐకేపీ సిబ్బంది శ్రమదానం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఐకేపీ సిబ్బంది శ్రమదానం చేశారు. పట్టణంలోని 18వ వార్డు రణదివ్యనగర్‌ కాలనీలో ఖాళీ స్థలాల్లో వెలసిన పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా డీఎంసీ సుభాష్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. రోడ్లపై, మురికి కాల్వల్లో చెత్తను వేయవద్దన్నారు. కార్యక్రమంలో టీఎంసీ భాగ్యలక్ష్మి, గంగన్న, పండరి, సిబ్బంది ఉన్నారు. 

ఖాలీస్థలాల్లో చెత్తను తొలగించండి

పట్టణ ప్రణాళికలో భాగంగా ఖాళీ ప్లాట్లలో వెలసిన పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించాలంటూ అధికారులు యజమానులకు నోటీసులు అందజేస్తున్నారు. పట్టణంలోని రామ్‌నగర్‌ కాలనీలోని ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు, చెత్త ఉండడంతో ప్రత్యేక అధికారి జాకీర్‌, వార్డు కౌన్సిలర్‌ తుర్పటి సుజాత భూమన్న ఆదివారం యజమానికి నోటీసులు ఇచ్చారు. రణదివ్యనగర్‌, గాంధీనగర్‌, రవీందర్‌ నగర్‌, భుక్తాపూర్‌, కాలనీలతోపాటు పలు కాలనీల్లో ఖాళీ స్థలాల యజమానులకు డీఎంసీ సుభాష్‌ నోటీసులను అందజేశారు. పట్టణంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. logo