శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 28, 2020 , T00:40

బాసర వ్యాపార సముదాయాలకు టెండర్లు

బాసర వ్యాపార సముదాయాలకు టెండర్లు

బాసర : బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వివిధ వ్యాపార సముదాయాలకు గురువారం ఆలయ అధికారులు టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్‌ నిర్వాహణలో అమ్మవారి ఆలయానికి రూ. 2కోట్ల87లక్షల66వేల79 భారీ ఆదాయం సమకూరింది. అమ్మవారికి సమర్పించే చీరలు, కానుకలు అమ్ముకునే సేల్స్‌ కౌంటర్‌ను విఠల్‌రావు రూ. 16లక్షల 33వేల 999కు దక్కించుకున్నారు. పూజా సామగ్రి సేల్స్‌ కౌంటర్‌ మొదటి దుకాణం కే. ప్రవీణ్‌ రూ.66లక్షల 63వేల 649, రెండో దుకాణం జే.మారుతి పటేల్‌ రూ.41లక్షల 41వేలు 431లకు, ఆలయంలో ఫొటోలు తీసే కౌంటర్‌కు నర్సయ్య రూ.43లక్షల71వేలకు దక్కించుకున్నాడు. సెల్‌ఫోన్‌లు, కెమెరాలు భద్రపర్చే కౌంటర్‌ను ప్రవీణ్‌రావు రూ. 26లక్షలా 5వేలకు, కొబ్బరికాయలు కొట్టే, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు నరేశ్‌ రూ.19లక్షల 48వేలకు, గోదావరి నది వద్ద డొప్పలు, పూలు అమ్ముకునే కౌంటర్‌కు నవీన్‌ రూ.15లక్షల 11వేలకు దక్కించుకున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణం నంబర్‌.2కు రాంచందర్‌రావు రూ.13లక్షలకు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా టెండర్లలో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. మిగిలిన దుకాణాలకు శుక్రవారం, శనివారం టెండర్లు నిర్వహిస్తామని అన్నారు. మొదటి రోజు దేవస్థానం పరిధిలోని హోటల్‌కు పాటదారులు ఎవరూ రాకపోవడంతో రద్దు చేశామని, తిరిగి త్వరలో టెండరు నిర్వహిస్తామని తెలిపారు. దేవస్థానం పరిధిలో విడిపూలు, పూల జతలు అమ్ముకునే రెండు కౌంటర్లకు గతేడాది కంటే సీల్డ్‌ టెండర్లు తక్కువగా రావడంతో వాటిని రద్దు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ అజయ్‌బాబు, సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, ఆలయ అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు.


logo