సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 28, 2020 , T00:25

పట్టణ ప్రగతితోనే వార్డులకు మహర్దశ

పట్టణ ప్రగతితోనే వార్డులకు మహర్దశ

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతితోనే వార్డులకు మహర్దశ చేకూరుతుందని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రం బస్టాండ్‌ ప్రాంగణంలోని పరిసరాలను పరిశీలించారు. బస్టాండ్‌ ఆవరణలోఉన్న లోతు ప్రదేశంలో మురికి నీరు నిలిచి,దుర్ఘందంతో  ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు  అవకాశం ఉంటుందని కాలనీలో ముఖ్యమైన సమస్యలను గుర్తించి సంబంధిత కౌన్సిలర్లు అధికారులకు వివరించాలన్నారు.కార్యక్రమంలో మున్సిపల్‌ డీఈ సంతోశ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మురారీ, కౌన్సిలర్లు తదితరులున్నారు.

కొనసాగుతున్న పట్టణ ప్రగతి

పట్టణ ప్రగతి పట్టణంలో విస్తృతంగా కొనసాగుతోంది. పట్టణంలోని 42 వార్డుల్లో నిర్వహిస్తున్న పట్టణ కార్యక్రమం గురువారం నాలుగో రోజుకు చేరింది. వార్డులకు కేటాయించిన ప్రత్యేక అధికారులు, వార్డు కౌన్సిలర్లు, కమిటీ మెంబర్లు ఉదయమే కాలనీలో పర్యటించారు. కాలనీ వాసుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కొన్ని వార్డులలో డ్రైనేజీలను శుభ్రం చేశారు.వీధి దీపాలను పరిశీలించారు. కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు, కాలనీల ప్రజలు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు 

పట్టణ కేంద్రంలోని బ స్టాండ్‌, మంచిర్యాల్‌ చౌర స్తా, పాత, కొత్త బస్టాండ్‌, ఈద్‌గాం చౌరస్తాతో పాటు ఇతర చోట్ల ట్రాఫిక్‌ సమస్య లు తలెత్తకుండా చర్యలు చేపడుతామని మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ అన్నారు. గురువారం ట్రాఫిక్‌ ఎస్సై ఆసిఫ్‌, ఏఎస్సై దేవన్నతో కలిసి ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యామ్నాయ చర్యలను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రం కా వడంతో రోజు రోజుకు ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతుందని అన్నారు. ప్రత్యామ్నాయ చర్యలపై మున్సిపల్‌ శాఖ ఆలోచిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బంగల్‌పేట్‌ వార్డు కౌన్సిలర్‌ బిట్లింగ్‌ నవీన్‌, శాంతినగర్‌ వార్డు కౌన్సిలర్‌ సంపంగి రవి తదితరులున్నారు.


logo