మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Feb 26, 2020 , 23:43:07

జైనథ్‌ మండలంలో పెద్దపులి సంచారం

జైనథ్‌ మండలంలో పెద్దపులి సంచారం

జైనథ్‌ : మండలంలోని నిరాల సమీపంలో మంగళవారం రాత్రి పెద్దపులి రోడ్డు దాటుతుండగా స్థానికుల కంట పడింది. దీంతో  ఫొటోలు తీశారు. మాంగూర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దేవుజిగూడ గ్రామంలోని రాము అనే రైతు ఎడ్లను తీవ్రంగా గాయపర్చింది. గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో పెద్దపులి పార్డీ, రామాయి మధ్యలో ఉన్న సాత్నాల వాగులో మధ్యా హ్నం వరకు దాగి ఉంది. అటవీ అధికారులకు సమాచారం అందడంతో డీఎఫ్‌వో చంద్రశేఖర్‌ అటవీశాఖ అధికారులు మేడిగూడ, పార్డీ, రామాయి గ్రామాల పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి పులి అడుగులను పరిశీలించారు.  ఎడ్లు తీవ్రంగా గాయపడడంతో బుధవారం మండల పశువైద్యాధికారి వినోద్‌ దేశ్‌పాండే వైద్య చికిత్స నిర్వహించారు. పెద్దపులి సంచారంతో మండలంలోని నిరాల, జైనథ్‌, లక్ష్మీపూర్‌, మాంగూర్ల, మేడిగూడ, పార్డీ, కంఠ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  logo
>>>>>>