ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 26, 2020 , 23:40:27

ఉత్సాహంగా పట్టణ ప్రణాళిక

ఉత్సాహంగా పట్టణ ప్రణాళిక

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రణాళిక కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. మూడోరోజు బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, ప్రత్యేకాధికారులు, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి  పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు వార్డుల్లో సమస్యలను గుర్తించి అప్పటికప్పుడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.  శిథిలావస్థలో ఉన్న భవనాల కూల్చివేత, ఖాళీస్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఖానాపూర్‌ కాలనీలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భుక్తాపూర్‌ కాలనీలో కౌన్సిలర్‌ బండారి సతీశ్‌ ప్రత్యేక అధికారితో కలిసి పర్యటించారు. వంగిన కరెంట్‌ పోల్స్‌ తొలగించడం, కొత్త స్తంభాల ఏర్పాటు, వేలాడుతున్న కరెంట్‌ వైర్లను సరిచేయించారు. పూడికతో నిండిపోయిన డ్రైనేజీల నుంచి చెత్తను తొలగించారు. ఈ పట్టణ ప్రగతిలో భాగంగా సౌకర్యాలు మెరుగుపడడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


logo