మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Nirmal - Feb 26, 2020 , 23:25:13

మట్టి గణపతులనే తయారు చేయాలి

మట్టి గణపతులనే తయారు చేయాలి

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : పర్యావరణానికి హా నీ కలుగకుండా మట్టి వినాయకులను తయారు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల తయారీదారులకు సూచించారు. బుధవారం సిద్దిపేటలోని తన నివాసంలో విగ్రహ తయారీదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సారి మట్టి గణపతులనే తయారు చేయాలని ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను తయారు చేస్తే అంగీకరించమన్నారు. 6 నెలల ముందుగానే చెబుతున్నామని నిర్వాహకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మట్టి వినాయకుల తయారీ కోసం రుణ సదుపాయం అందిస్తామన్నారు. 

బీసీ కార్పొరేషన్‌ ద్వారా విగ్రహాల తయారీకి ముడి సరుకు, రుణాలు అందించే అంశంపై తయారీదారులకు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండి చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్‌ ఈడీ సరోజకు సూచించారు. 


పదేండ్ల వేడుకలో మంత్రి హరీశ్‌రావు.. 

సిద్దిపేట గాంధీ చౌక్‌ వ్యాపార సంఘం పదేళ్ల వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరై కేకు కట్‌ చేశారు.  వ్యాపారులకు కేకును తినిపించి వేడుకల్లో పాలుపంచుకున్నారు. 


రోబోటిక్‌ ఎనిమల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం 

జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని 22వ వార్డులోని ఫన్‌ అండ్‌ ఫేర్‌ డిస్నిల్యాండ్‌ రోబోటిక్‌ ఆనిమల్‌ ఎగ్జిబిషన్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రోబోటిక్‌ ఆనిమల్‌ ఎగ్జిబిషన్‌ ప్రదర్శనను తిలకించారు. అంతకు ముందు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గౌటి అశోక్‌ తల్లి మరణించగా వారి కుటుంబాన్ని ఓదార్చి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. మంత్రి హరీశ్‌రావు వెంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, సుడా డైరెక్టర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు బ్రహ్మం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


logo