గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 26, 2020 , 00:16:23

ప్రగతి పండుగ

ప్రగతి పండుగ

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతి కార్యక్రమం పండుగలా కొనసాగుతున్నది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, వార్డు కమిటీలు తొలి రోజు వార్డుల్లో పర్యటించి గుర్తించిన సమస్యల  పరిష్కారానికి మంగళవారం చర్యలు చేపట్టారు. రెండో రోజు మంగళవారం సైతం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారం, సౌకర్యాలు మెరుగు పడుతుండడంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

మెరుగు పడుతున్న సౌకర్యాలు.. 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గల్లీల్లో సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి. రెండో రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖాళీస్థలాల్లో పెరిగిన పించ్చిమొక్కలను తొలగించారు. పెరుకుపోయిన చెత్తను తొలగించడం, మురికి కాల్వల్లో పూడిక తీత పనులు చేపడుతున్నారు. ఈగలు, దోమలు వృద్ధిచెందకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ను వేస్తున్నారు.  శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్న పాత ఇండ్లు, భవనాలను కూల్చివేయిస్తున్నారు.  రిక్షా కాలనీలో ఓ పాడుబడిన బంగ్లాను కాలనీ వాసుల సూచన మేరకు కూల్చివేయించారు. భుక్తాపూర్‌, రామ్‌నగర్‌, శాంతినగర్‌, అంబేద్కర్‌నగర్‌, ఫిల్టర్‌బెడ్‌, హమీద్‌పురా కాలనీల్లో తాగునీటి పైప్‌లైన్‌ లీకేజీలను అప్పటికప్పడు సరిచేశారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణం సుందరంగా రూపుదిద్దుకొనుండగా ప్రజలు హర్షవ్యక్తం చేస్తున్నారు. దోబీకాలనీలో అదనపు కలెక్టర్‌ పర్యటించారు. ఖానాపూర్‌ కాలనీలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. రామ్‌నగర్‌ కాలనీలో డీఈఈ ఇరిగేషన్‌ అధికారి డీపీఆర్‌వో భీమ్‌కుమార్‌ పర్యటించారు. భుక్తాపూర్‌ కాలనీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. పది రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యలు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 


logo
>>>>>>