శనివారం 28 మార్చి 2020
Nirmal - Feb 26, 2020 , 00:10:29

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి

ఆదిలాబాద్‌ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాలలో గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం ఇంగ్లిష్‌ మీడియం ఉపాధ్యాయులకు సూక్ష్మ భోదనపై ఒక్కరోజు శిక్షణ, సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఈవో మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అన్వయించాలని సూచించారు. కేజీబీవీల్లో చదివే విద్యార్థులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, వారిలోని విద్యానైపుణ్యాలను  పెంపొందించాలన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమంలో సెక్టోరల్‌ అధికారులు కంటె నర్సయ్య, కంది శ్రీనివాస్‌రెడ్డి, డైట్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ కిరణ్‌కుమార్‌, ఏఎస్‌వో శ్రీహరి, డైట్‌ అధ్యాపకులు కిషన్‌రెడ్డి, సంతోష్‌, చంద్రశేఖర్‌, స్వర్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. 


logo