ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 25, 2020 , 02:32:43

‘ప్రజావాణి’కి వినతులు

‘ప్రజావాణి’కి వినతులు

నిర్మల్‌ టౌన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లోపే పరిష్కరించాలని  కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టర్‌ కార్యాలయంలో ని గ్రీవెన్స్‌ సెల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. వచ్చిన ప్రతి దరఖాస్తును ఆయా శాఖల అధికారులు ఆన్‌లైన్‌లో పంపిస్తామని, వాటిని వారం రోజుల్లోపు పరిష్కరించాలని, పరిష్కారం కాని సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్‌ స్వీకరించి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, డీఆర్వో సోమేశ్వర్‌, ఆర్డీవో ప్రసునాంబ, కలెక్టర్‌ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. 


ప్రభుత్వ వైద్యురాలిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

నిర్మల్‌ పట్టణంలోని ప్రసూతి దవాఖానలో విధులు నిర్వహిస్తున్న ఓ డాక్టర్‌ ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులకు రోగంతో భయపెట్టి ప్రైవేటు దవాఖానలో చికిత్స చేస్తూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని సోమవారం బాధితులు కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సో మవార్‌పేట్‌కు చెందిన కిషన్‌రావు ఇటీవలే ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా.. ప్రైవేటులో వైద్యం చేయించుకోవాలని సూ చించిందన్నారు. ప్రైవేటులో వైద్యం చేయించుకున్న తర్వాత ఆమె పేర్కొన్న మేరకు బిల్లులు ఇవ్వకపోతే రోగిని ఎలాంటి డ్రెస్సింగ్‌ లేకుండా ఇంటికి పంపిందని, దీంతో రోగి అనారోగ్యానికి గురైందని కలెక్టర్‌కు వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాస్‌, సురేశ్‌, అరవింద్‌ పాల్గొన్నారు. 


కలెక్టర్‌ను కలిసిన సర్పంచులు, ఎంపీటీసీలు...

నిర్మల్‌ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీని కలెక్టర్‌ కార్యాలయంలో కలిసి విన్నవించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ కింద సాగు చేసుకుంటున్న భూములను డిజిటల్‌ పాసుపుస్తకాలు అందించి రైతుపెట్టుబడి సాయం అందించేలా చూడాలని పలువురు రైతులు కోరారు. సోన్‌ మండలం న్యూవెల్మల్‌లో గ్రామ అవసరాల కు కేటాయించిన స్థలాన్ని కొంత మంది నాయకులు నకిలీ పత్రాలు సృష్టించి ఇతరులకు విక్రయిస్తున్నారని  సర్పంచు, వీడీసీ సభ్యులు కలెక్టర్‌కు కలిసి విన్నవించారు. పది రోజు ల్లోగా విచారణ పూర్తి చేయాలని డీఆర్వోను ఆదేశించారు.


logo