బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Feb 25, 2020 , 02:30:47

కార్మిక సంక్షేమ సర్కారు

కార్మిక సంక్షేమ సర్కారు

నిర్మల్‌ అర్బన్‌/ నమస్తే తెలంగాణ : కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. వారి కు టుంబాలు ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో పలు సం క్షేమ పథకాలు అమలుచేస్తున్నది. గత ప్రభుత్వాల కన్నా  భిన్నంగా భవన నిర్మాణ కార్మికుల బాగోగులు, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే భవన నిర్మాణ రంగ కార్మికులకు అందుతున్న సంక్షేమ ఫలాలను పెద్దమొత్తంలో అందిస్తున్నది. గత ప్రభుత్వా లు చాలీ చాలని ఎక్స్‌గ్రేషియాను అందించడంతోపాటు సరైన సమయంలో ఇవ్వడంలో నిర్లక్ష్యం చూ పేవి.  అనర్హులు సైతం లబ్ధిపొందినట్లు ఆరోపణలూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రస్తుతం  ఆన్‌లై న్‌ నమోదుతో ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నది.


నమోదు చేసుకుంటేనే ఫలాలు వర్తింపు....  

భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో రిజిస్ట్రేషన్‌ చేయించుకొని గుర్తింపు పొందినవారికే ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అందుతుందని  ఆధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కూలీలు, ఎలక్ట్రిషియన్లు ప్లంబర్లు, మేస్త్రిలు, రాడ్‌ బెండింగ్‌ చేసేవారు ఇతరత్రా కూలీలు దీనికి అర్హులని కార్మికశాఖ పేర్కొంది. నెలకు ఒక్క రూపాయి, ఏడాదికి రూ.12 చొప్పున ఐదు సంవత్సరాలకు రూ.60, రిజిస్ట్రేషన్‌ చార్జీలు రూ.50 మొత్తం రూ.110 చలానా తీసి, కార్మికశాఖలో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకు 13,748 మంది వివిధ రంగాలలో పని చేస్తున్న కార్మికులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా వారికి గుర్తింపు కార్డులను అధికారులు మంజూరు చేశారు.


ఎక్స్‌గ్రేషియా పెంపు

భవన నిర్మాణ కార్మికులు ప్రమాదానికి గురై మరణిస్తే బాధిత కుటుంబానికి, వారసులకు, నామినీలకు ఇచ్చే మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం గణనీయంగా పెంచింది. క్షతగాత్రులకు, అర్హులైన లబ్ధిదారులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా అందజేస్తున్నది. ప్రమాదంలో గాయపడి అవయవాలు పోగొట్టుకుంటే కృత్రిమ అవయవాలు, వీల్‌ చైర్లు, ట్రై సైకిళ్లను ఇస్తోంది. ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి అందించే మొత్తం గతంలో రూ.5లక్షలు ఉంటే ఇప్పడు రూ.6లక్షలు, దహన సంస్కార ఖర్చుల నిమిత్తం రూ.30వేలు, శాశ్వత అంగవైకల్యం రూ.3లక్షల నుంచి రూ.4లక్షలకు పెంచింది. తాత్కాలిక అంగవైకల్యం కలిగితే గతంలో ఉన్న రూ.9వేలను రూ.13,500లకు, సాధారణ మరణం పొందితే రూ.60వేలకు పెంచి కుటుంబాల్లోని సభ్యుల ఖాతాకు జమ చేస్తున్నది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోనే ఎక్స్‌గ్రేషియాను అందజేస్తున్నారు.


ఇప్పటి వరకు రూ.2.43 కోట్ల పంపిణీ

జిల్లాలోని 753 మంది భవన నిర్మాణ రంగాల కార్మికులకు సంక్షేమ పథకాల కింద ఇప్పటి వరకురూ.2కోట్ల 43లక్షల 65 వేలు అందజేశారు. కార్మిక కుటుంబాల్లోని మహిళలకు ప్రసూతి సహాయం కింద 377 మందికి రూ.90.20 లక్షలు, సహజ మరణం పొందిన 163 మంది కార్మికులకు  రూ. 79.60 లక్షలు, ప్రమాదవశాత్తు మరిణించిన కార్మికుల 12 మంది కుటుంబాలకు రూ.29 లక్షలు, మ్యారేజ్‌ బహుమతుల స్కీం కింద 114 మందికి రూ.25.80లక్షలు, తాత్కాలిక అంగవైకల్యం పొందిన నలుగురికి  రూ.15వేలు , దహన సంస్కారాలకు 83 మందికి గాను రూ.18.90 లక్షలు పంపిణీ చేశారు. మొత్తం రూ.2.43 కోట్లు అర్హు లైనవారికి, వారి కుటుంబ సభ్యుల్లోని భాతాలకు ప్రభుత్వం జమ చేసింది.


logo
>>>>>>