సోమవారం 30 మార్చి 2020
Nirmal - Feb 24, 2020 , 02:07:36

అత్తింటి వేధింపులకు యువతి బలి

అత్తింటి వేధింపులకు యువతి బలి

దస్తురాబాద్‌ : ప్రేమించిన యువకుడిని దక్కించుకోవాలని ముంబయి నుంచి బుట్టాపూర్‌ గ్రామానికి చేరుకుంది. మహిళా సంఘాల సహాయంతో పోరాడి అనుకున్నది సాధించింది. అత్తింటివారు, భర్త  మానసిక వేధింపులు భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకుంది. దస్తురాబాద్‌ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తెలిపిన  వివరాల ప్రకారం.. మండలంలోని బుట్టాపూర్‌ గ్రామానికి చెందిన మహేశ్‌, బెంగళూరుకు చెందిన సునీత (29) ముంబయిలో ఒక ఇంట్లో పని చేస్తూ మూడు సంవత్సరాలు సహ జీవనం చేశారు.. యువతిని పెండ్లి చేసుకుంటా అని చెప్పిన మహేశ్‌ సొంత గ్రామానికి వచ్చాడు. అప్పటి నుండి అతని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో సదరు యువతి మహేశ్‌ స్వేహితులను ఆశ్రయించి ముంబయి నుంచి బుట్టాపూర్‌ గ్రామానికి చేరుకుంది.  స్థానిక మహిళా సంఘాల సహాయంతో మహేశ్‌ ఇంటి ముందు మౌన దీక్ష చేసి ఊరి పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకుంది. కానీ కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు జరగడం, వేధింపులు ఎక్కువ కావడంతో శుక్రవారం గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను నిర్మల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందింది. కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు తెలిపారు.


కఠినంగా శిక్షించాలి

సునీత ఆత్మహత్యకు  కారణమైన కుటుంబసభ్యులు, భర్త మహేశ్‌లపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌. ఆదివారం దస్తురాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.


logo