నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ

నిర్మల్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ స్వచ్ఛమైన నీటిని ప్రతి ఇంటికి అందించడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. జిల్లాలో ఈ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించేందుకు జిల్లా గ్రామీణ మంచినీటి సరఫరా మిషన్ భగీరథ అధికారుల సమన్వయంతో ‘స్టెబిలేషన్' ఇప్పటికే ప్రారంభించగా.. దీనిపై క్షేత్రస్థాయిలో లక్ష్యం మేరకు ప్రయోజనాలు అందించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా 710 ఆవాస గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందించాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 649 గ్రామాలకు నీరు అందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా అన్ని గ్రామాల్లో ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 450 ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులను మంజూరు చేయగా.. ఇప్పటికే 430 పూర్తి చేయగా మిగతా పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయి. వారం రోజుల క్రితమే జిల్లా పంచాయతీ కార్యదర్శులతో సర్వే నిర్వహించి కలెక్టర్ గ్రౌండ్ రిపోర్టును తీసుకున్నారు. జిల్లాలోని స్టెబిలేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, నిర్మల నియోజకవర్గంలో 30, భైంసా నియోజకవర్గంలో 17, ఖానాపూర్ నియోజకవర్గంలో 14 గ్రామాలను ఎంపిక చేశారు. పర్యవేక్షణ కోసం ముగ్గురు ప్రత్యేకాధికారులను నియమించారు.
నేడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం..
మిషన్ భగీరథ పై కలెక్టర్ సోమవారం జిల్లా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఎన్ని గ్రామాలకు నీటి సరఫరాచేశారు, స్టెబిలేషన్, కాంట్రాక్టర్ల ఇబ్బందులు, భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లు కూడా హాజరుకావాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథకు విద్యుత్ సౌకర్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖల సమన్వయంతో ఈ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా అవుతున్నప్పటికీ ఆ నీటిని గ్రామీణ ప్రజలు తాగడానికి ఆసక్తి చూపడంలేదు. దీంతో దానిపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించేందుకు అవగాహన కల్పిచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం మండల, గ్రామీణ స్థాయిల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిషన్ భగీరథ సురక్ష ఆరోగ్య నీరు అని ప్రజలకు వివరించే విధంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడంతో భగీరథ నీటి వాడకం జరగడం లేదని కొంద రు అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అనుమతులు లేని వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
తాజావార్తలు
- పిల్లల డాక్టరైనా.. విచక్షణ కోల్పోయి..
- కొవిడ్ షాక్ : పసిడి డిమాండ్ భారీ పతనం
- సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న కార్తీకదీపం ఫేమ్
- ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆప్ పోటీ
- వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశంగా భారత్
- చిల్లరిచ్చేలోపు రైలు వెళ్లిపోయింది... తరువాతేమైందంటే?..
- ఆ తీర్పు ఇచ్చింది జస్టిస్ పుష్పా వీరేంద్ర.. ఎవరామె ?
- తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- కేంద్రమే రైతులను రెచ్చగొట్టింది : శివసేన