ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 22, 2020 , 03:13:03

హరహర మహాదేవ!

హరహర మహాదేవ!

‘హరహర మహాదేవ...శంభో శివ శంకరా..’ అంటూ శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగాయి. జిల్లాలో శుక్రవారం మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

  • భక్తిశ్రద్ధలతో మహా శివరాత్రి వేడుకలు
  • భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
  • కొనసాగిన అభిషేకాలు, ప్రత్యేక పూజలు
  • ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
  • నేడు పలు ఆలయాల్లో అన్నదానాలు

‘హరహర మహాదేవ...శంభో శివ శంకరా..’ అంటూ శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగాయి. జిల్లాలో శుక్రవారం మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు కొనసాగాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్షల నేపథ్యంలో నేడు పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

హరహర మహాదేవా...శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగాయి. జిల్లాలో శుక్రవారం మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని ఆలయాలతోపాటు  జిల్లాలోని పలు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


logo